వారఫలాలు

mesharasi, horoscope, meepurohit

మేషరాశి: అశ్వని – 1,2,3,4 పాదములు, భరణి – 1,2,3,4 పాదములు, కృత్తిక – 1 పాదము.

మేష రాశి వారికి ఈవారం ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయంలో కాస్త అనుకూలంగా ఉంటుంది. శుభ వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్న కూడా వృద్ధిలోకి వస్తారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది.
వారి యొక్క విద్యా విషయాలలో శ్రద్ధ చూపించడం జరుగుతుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి.

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలను పొందడం కొరకు నిత్యము ఆదిత్య హృదయం మరియు సుబ్రమణ్య ఆరాధన చేయడం మంచిది.

vrushabharasi, horoscope, astrology, meepurohit

వృషభరాశి: కృత్తిక – 2, 3, 4 పాదములు, రోహిణి – 1, 2, 3, 4 పాదములు, మృగశిర – 1, 2 పాదాలు

వృషభ రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలత ఉన్నా కూడా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. నూతన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. రాబడి తో సరి సమానంగా ఖర్చులు కూడా వుండటం జరుగుతుంది. సమాజంలో సంబంధబాంధవ్యాలు అనేవి సామాన్యంగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు సామాన్యమైన కాలంగా చెప్పవచ్చును. రాజకీయ, సినీ, కళా తదుతర అన్ని రంగాల వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి.

మొత్తం మీద ఈ రాశివారు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము , సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ, ఆదిత్యహృదయము మరియు నవగ్రహ ప్రదక్షిణ చేయడం చెప్పదగిన సూచన.

mithunarasi, horoscope, meepurohit, astrology

మిథునరాశి: మృగశిర – 3, 4 పాదములు, ఆర్ద్ర – 1, 2, 3, 4 పాదములు, పునర్వసు – 1, 2, 3

మిధున రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలతలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాల్లో చెప్పుకోదగ్గ మార్పులు అంటూ ఏమీ ఉండవు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా చేయించుకోవడం, పుణ్య కార్యక్రమాలు చేయడం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు చూసుకుంటారు. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలం గా చెప్పవచ్చు. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము గణేశారాధన, దుర్గ అమ్మవారి స్తుతి పారాయణం చేయడం మంచిది.

karkatakarasi, meepurohit, horoscope, astrology

కర్కాటకరాశి: పునర్వసు – 4వ పాదము, పుష్యమి – 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష – 1, 2, 3, 4.

కర్కాటక రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాలలో బాగుంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో సహాయ సహకారాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. సంఘములో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలం గా వుంటుంది. ఆర్థికపరమైన విషయాలలో పురోగతికై చాలా కష్టపడతారు. అలాగే అనుకూలంగా కూడా ఉంటుంది. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. కొత్త వ్యక్తుల తో కలిసి పోవడం జరుగుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. పోటి రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.

మొత్తం మీద ఈ రాశి వారి అందరికీ శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అయినా కూడా ఇందులో ఎక్కువగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వరకు నిత్యం ఆదిత్య హృదయ పారాయణ, దుర్గ అమ్మ వారి యొక్క అష్టోత్తరము మరియు లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయడం మంచిది.

simharasi, horoscope, astrology, meepurohit

సింహరాశి: మఖ – 1, 2, 3, 4 పాదములు, పుబ్బ – 1, 2, 3, 4 పాదములు, ఉత్తర – 1 పాదం.

సింహ రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల లో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల్ని మధ్యమధ్యలో నియంత్రించుకోవడం చెప్పదగ్గ సూచన. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలలో సామాన్యంగా ఉంటాయి. రాజకీయ,సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా విజయావకాశాలు చోటుచేసుకుంటాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది.

మొత్తంమీద ఈ వారం ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యం ఆదిత్య హృదయ పారాయణం, లక్ష్మీ ఆరాధన చేయడం మరియు సుబ్రమణ్య స్వామి యొక్క భుజంగ స్తోత్ర పారాయణం చేయడం మంచిది.

kanyarasi, horoscope, astrology, meepurohit

కన్యారాశి: ఉత్తర – 2, 3, 4 పాదములు, హస్త – 1, 2, 3, 4 పాదములు, చిత్త – 1, 2 పాదములు

కన్యా రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యు ల విషయాలలో అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి కనబడుతుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన విషయాలలో సామాన్యంగా ఉంటుంది. రుణాలకు ప్రయత్నిస్తున్న వారికి రుణాలు దొరుకుతాయి. ఆర్థిక పరంగా కొంత ఊరట లభిస్తుంది. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఇంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చకు రావడం జరుగుతుంది. రాజకీయ, సినీ, కళా తదితర అని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలం.

మొత్తంమీద ఈ వారం ఈ రాశి వారి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు శివారాధన, లక్ష్మీ ఆరాధన, మరియు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం.

tularasi, thularasi, meepurohit, horoscope, astrology

తులారాశి: చిత్త – 3, 4 పాదములు, స్వాతి – 1, 2, 3, 4 పాదములు, విశాఖ – 1, 2, 3 పాదములు

తులా రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలోని, స్నేహం వర్గంలోని సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలం గా వుంటుంది. ఇంట బయట కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలం గా చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ,వ్యాపార విషయాలలో వీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. సంతానము యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సంతోషకరమైన వార్తలు వింటారు. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.

మొత్తంమీద ఈ వారం ఈ రాశివారికి శుభాశుభ ఫలితాల మిశ్రమం గా గోచరిస్తున్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము ఆదిత్య హృదయ పారాయణం, సూర్యనమస్కారాలు చేయడము మరియు దుర్గా ఆరాధన చేయడం మంచిది.

vrushchikarasi, meepurohit, horoscope, astrology

వృశ్చిక రాశి: విశాఖ – 4వ పాదము, అనూరాధ – 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ – 1, 2, 3, 4 పాదములు

వృశ్చిక రాశి వారికి ఈవారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో ఆనందంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చు అనేది వెచ్చించడం జరుగుతుంది. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం సామాన్యంగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో శుభవార్తలు వింటారు. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోను కొద్దిగా శ్రమించవలసి ఉంటుంది.

మొత్తంమీద ఈ వారం ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన, శివారాధన, లక్ష్మీ ఆరాధన మరియు నవగ్రహ ప్రదక్షిణ చేయడం .

dhanurasi, dhanussu rasi, meepurohit, horoscope, astrology

ధనూరాశి: మూల – 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాడ – 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ – 1 వ పాదము

ధనూరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. తినే ఆహారపదార్థాల్లో నియమాలు పాటించడం ద్వారా మంచి ఆరోగ్యం పొందుతారు. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో సామాన్యంగా ఉంటుంది. మిత్రులను కలుసుకుంటారు. సంబంధంలేని విషయాలలో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. ఆదాయం తో సమానంగా ఖర్చులు ఉండటం జరుగుతుంది. కాబట్టి ఖర్చులను అదుపులో ఉంచుకోవటం అనేది చెప్పదగ్గ సూచన. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. దైవారాధన ద్వారా వాటిని పోగొట్టుకోవచ్చు . ఈ రాశి విద్యార్థులకు వారం సామాన్యమైన కాలం గా చెప్పవచ్చు. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. తల్లితండ్రులు ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. రాజకీయ, సినీ, కళా తదుపరి అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.

మొత్తంమీద ఈ వారం ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలను మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము హనుమాన్ చాలీసా పారాయణము, గణపతి ఆరాధన మరియు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం మంచిది.

makararasi, meepurohit, horoscope, astrology

మకరరాశి: ఉత్తరాషాడ – 2, 3, 4 పాదములు, శ్రవణం – 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ – 1, 2 పాదములు

మకర రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో జాగ్రత్త వహించాలి. తల్లి తండ్రి ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉన్నా కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. సంతానం యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యంగా ఉంటుంది.

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము హనుమాన్ చాలీసా పారాయణము, ఆదిత్య హృదయ పారాయణ మరియు నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం ఉత్తమం.

kumbharasi, kumba rasi, meepurohit, horoscope, astrology

కుంభరాశి: ధనిష్ఠ – 3, 4 పాదములు, శతభిషం – 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర – 1, 2, 3 పాదములు.

కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అభివృద్ధికి చాలా పాటు పడటం జరుగుతుంది. వాటిలో కాస్త అనుకూలత కూడా లభిస్తుంది. తల్లితండ్రులు ఆరోగ్య విషయాలో స్వల్ప అనారోగ్య సూచన వున్నా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు. సంతానం యొక్క వృత్తికి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది.ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు.రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. పోటీ రంగం వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.

మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలను మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి నిత్యము సుబ్రమణ్య ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, శివారాధన మరియు హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

meenarasi, meepurohit, horoscope, astrology

మీనరాశి: పూర్వాభాద్ర – 4 వ పాదం, ఉత్తరాభాద్ర – 1, 2, 3, 4 పాదములు, రేవతి – 1, 2, 3, 4 పాదములు

మీన రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు ఈ వారం మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్న కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. కొన్ని నూతన పనులకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి.

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి నిత్యము సుబ్రమణ్య ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణ, మరియు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం మంచిది.

**వ్యక్తిగత జాతకాలకు మరియు ఇతర వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి
మా నంబర్లు: 8121009900 (whatsapp) / 8121003300
మా ఈమెయిల్: service@meepurohit.com

horoscope #weeklyhoroscope #meepurohit #astrology #raasiphalalu #varaphalalu