Weekly Horoscope 14April19-20April19

వారఫలాలు

మేష రాశి: అశ్వని – 1,2,3,4 పాదములు, భరణి – 1,2,3,4 పాదములు, కృత్తిక – 1 పాదము

మేష రాశి వారికి ఈవారం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.  జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో అనుకూలంగా ఉంటుంది.  వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు కలవు.  వీరికి ధనలాభం, ట్రాన్స్ఫర్ లు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు,  పై అధికారులను కలుసుకోవడం వారి యొక్క మన్నన పొందడం కూడా జరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి.  ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు.  రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారూ ఈవారం మంచి  అవకాశాలు పొందుతారు.  

మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము  దత్తాత్రేయ ఆరాధన మరియు సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయడం ఉత్తమం.

వృషభ రాశి: కృత్తిక – 2, 3, 4 పాదములు, రోహిణి – 1, 2, 3, 4 పాదములు, మృగశిర – 1, 2 పాదాలు

వృషభ రాశి వారికి ఈవారం ఆరోగ్య విషయాలలో అనుకూలంగా ఉంటుంది. కానీ, ఆహారం విషయంలో సమయపాలన పాటించడం మంచిది.  జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సభా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పై అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. అయితే మీరు చేసిన కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి.  ఈ రాశి విద్యార్థులకు సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు.  తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ప్రయాణాల్లో కలిసి వచ్చినా కూడా ప్రయాణం వల్ల అలసట ఉంటుంది.  సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది.  రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.  

మొత్తంమ్మీద వృషభ రాశివారికి ఈ వారం  శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 

మంచి ఫలితాలు కొరకు నిత్యము విష్ణు సహస్రనామ పారాయణము మరియు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం ఉత్తమం.

మిధున రాశి: మృగశిర – 3, 4 పాదములు, ఆర్ద్ర – 1, 2, 3, 4 పాదములు, పునర్వసు – 1, 2, 3 పాదములు

మిథున రాశి వారికి ఈవారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్య ఫలితాలు ఉంటాయి.  ఆర్థికపరమైన విషయాలలో  పురోగతి ఉంటుంది. దూరప్రయాణాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. తల్లితండ్రుల ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు.  రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. 

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి నిత్యం  అమ్మ వారి యొక్క ఆరాధన మరియు శివారాధన చేయడం ఉత్తమం.

కర్కాటక రాశి: పునర్వసు – 4వ పాదము, పుష్యమి – 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష – 1, 2, 3, 4

కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో సహాయ సహకారాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాటికోసం సమాచార సేకరణ చేసుకోవడం జరుగుతుంది. కొత్త పరిచయాలు జరుగుతాయి. వాటి వల్ల ఆనందం కలుగుతుంది. అదే విధంగా లాభదాయకంగా కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. రాజకీయ, సినీ, కళ తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.  

మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము దుర్గా ఆరాధన, దత్తాత్రేయ చరిత్ర పారాయణ మరియు దక్షిణామూర్తి చరిత్ర చదవడం ఉత్తమం.

సింహరాశి: మఖ – 1, 2, 3, 4 పాదములు, పుబ్బ – 1, 2, 3, 4 పాదములు, ఉత్తర – 1 పాదం

సింహరాశి వారికి వారం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది.  ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. తల్లిదండ్రులు ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. 

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలను పొందడం కొరకు నిత్యము విష్ణు సహస్రనామ పారాయణము మరియు లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబ స్తోత్రము చదువుకోవడం ఉత్తమం 

కన్యారాశి: ఉత్తర – 2, 3, 4 పాదములు, హస్త – 1, 2, 3, 4 పాదములు, చిత్త – 1, 2 పాదములు

కన్యరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో  అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలోను చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఈవారం ప్రయాణాలు ఉంటాయి. అన్ని రకాలుగానూ ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయంతో సమానంగా ఖర్చులు కూడా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి.  సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో కాస్త జాగ్రత్త వహించాలి. సంతానం యొక్క చదువు  విషయంలోను  శ్రద్ధ వహించాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యంగా ఉంటుంది. 

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము శనైశ్చర స్తోత్ర పారాయణ, శివాభిషేకము మరియు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఉత్తమం.

తులారాశి: చిత్త – 3, 4 పాదములు, స్వాతి – 1, 2, 3, 4 పాదములు, విశాఖ – 1, 2, 3 పాదములు

తులారాశి వారు ఈవారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి.  జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో చిన్న చిన్న అవరోధాలు ఉంటాయి, వాటిని అధిగమించి ముందుకు వెళ్లడం మంచిది.  వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో కాస్త ఒడిదుడుకులుగా ఉంటుంది. వారాంతానికి సర్దుమణుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. సమయానికి అనుకూలంగా ప్రతి పనిని చూసుకోవడం దానికి తగ్గ ప్రణాళిక వేసుకోవడం మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి సామాన్యంగా ఉంటుంది. వీరు తెలియని విషయాల యందు అనుభవం గలవారి సలహా సంప్రదింపులు తీసుకోవడం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. 

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము అమ్మ వారి యొక్క ఆరాధన మరియు శివారాధన చేయడం ఉత్తమం.

వృశ్చిక రాశి: విశాఖ – 4వ పాదము, అనూరాధ – 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ – 1, 2, 3, 4 పాదములు

వృశ్చిక రాశి వారు ఈ వారం ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి. వైద్యుల సంప్రదింపులు, సలహాలు కూడా తప్పవు, కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే  వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే ప్రతి పనియందు అధిక శ్రమ అనేది ఉంటుంది. అయినప్పటికీ కొత్త పనులు మరియు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉత్సాహం చూపిస్తారు. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాల్లో సాధారణంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాల్లో చెప్పుకోదగ్గ మార్పు అంటూ ఏమీ ఉండవు. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. మీయొక్క సహాయ సహకారాలను ఇతరులకు అందుతాయి. అలాగే  ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీరు అందుకోవడం కూడా జరుగుతుంది.  ఈ రాశి విద్యార్థులకు ఈ వారం  అనుకూలమైన కాలము అయినప్పటికీ కాస్త శ్రద్ధ పెట్టి చదవాల్సిన అవసరం కూడా ఉంది.  ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉన్నా కూడా దానికి తగ్గట్టు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి.  బంధుమిత్రులను కలుసుకుంటారు. వివాదాలకు వెళ్లకపోవడం మంచిది.  రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. 

మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలు  పొందడం కొరకు నిత్యము కరావలంబ స్తోత్ర పారాయణము మరియు లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేయడం ఉత్తమం.

ధనూరాశి: మూల – 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాడ – 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ – 1 వ పాదము 

ధనస్సు రాశి వారు ఈవారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధతో చేయాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందువినోదాల్లోపాల్గొంటారు.  ఉద్యోగ విషయంలో ఉన్నతి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడము వాటికి అనుకూలంగా ఉండటం జరుగుతుంది,  నూతన వ్యక్తుల పరిచయం జరుగుతాయి,  ఎవరితోనూ కలహాలకి వెళ్లడం మంచిది  కాదు. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సాధారణంగా ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. 

మొత్తంమీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.  

మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు వీరు నిత్యం శివారాధన చేయడం ఉత్తమం.

మకర రాశి: ఉత్తరాషాడ – 2, 3, 4 పాదములు, శ్రవణం – 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ – 1, 2 పాదములు

మకర రాశి వారికి ఈవారం ఆరోగ్య విషయాలలో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలత మరియు లాభాలు కూడా చోటుచేసుకుంటాయి. దూర ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది. చేసిన ప్రయాణాలు కలిసిస్తాయి. వ్యాపార విషయంలో కొంచెం మందకొడిగా ఉన్నా కూడా లాభాలు ఉంటాయి.  నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు కూడా ఉంటుంది.  తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం  అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు.  సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. 

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన శివారాధన మరియు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది.

కుంభ రాశి: ధనిష్ఠ – 3, 4 పాదములు, శతభిషం – 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర – 1, 2, 3 పాదములు

కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి.  మానసిక ఆందోళన కూడా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఎక్కడికైనా ప్రయాణాలు చేసినా అవి శ్రమతో కూడినవై ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఆదాయానికి సరిసమానంగా ఖర్చులు కూడా ఉంటాయి, దూరప్రయాణాలు అనేవి కొంత వరకు కలిసి వస్తాయి. దైవారాధన వల్ల కొంత మానసిక ఆందోళను దూరం చేసుకోవచ్చు.  జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాల్లో సామాన్యంగా ఉంటుంది.  తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి .  సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి అనేది ఉంటుంది.  ఈ రాశి విద్యార్థులకు సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు.  రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.  

మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. 

వీరు మరిన్ని మంచి ఫలితాలు  పొందటం కొరకు దుర్గా ఆరాధన చేయడం మరియు  ఆంజనేయస్వామి దండకం,  దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం ఉత్తమం.

మీన రాశి: పూర్వాభాద్ర – 4 వ పాదం, ఉత్తరాభాద్ర – 1, 2, 3, 4 పాదములు, రేవతి – 1, 2, 3, 4 పాదములు

మీనరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాలలో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో మీయొక్క విలువ పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్న అందరికీ కూడా పురోగతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో పై అధికారుల యొక్క మన్ననలు పొందారు,  వ్యాపారస్తులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది.  ఈ రాశి వారు మాట్లాడే విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి,  మిత్రులు యొక్క సహాయసహకారాలు కూడా కొంత వరకు అందటం అనేది జరుగుతుంది.  సంతానం యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది.  తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి.  ఈ రాశి విద్యార్థులకు వారు సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు. మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము  దుర్గా ఆరాధన మరియు లక్ష్మీ అష్టోత్తర పారాయణము,  దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర, దక్షిణామూర్తి స్వామి వారి పారాయణ చేయడం ఉత్తమం.

**వ్యక్తిగతజాతకాలకుమరియుఇతరవివరాలకొరకుమమ్మల్నిసంప్రదించండి
మానంబర్లు: 8121009900 (whatsapp) / 8121003300
మాఈమెయిల్: service@meepurohit.com
#horoscope #weeklyhoroscope #meepurohit #astrology #raasiphalalu #varaphalalu