Weekly Horoscope 12Mayl19-18May19
వారఫలాలు

మేషరాశి: అశ్వని – 1,2,3,4 పాదములు, భరణి – 1,2,3,4 పాదములు, కృత్తిక – 1 పాదము

మేషరాశి వారికి ఈవారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో ఆనందంగా గడుపుతారు. సంతానం యొక్క అభివృద్ధి ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా సర్దుకు పోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. మీరు చేసే నూతన ప్రయత్నాలు కొద్దిగా కష్టతరమైనా కూడా వాటిని సాధిస్తారు. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. 

మొత్తంమ్మీద మేషరాశివారికి ఈ వారం శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము సుబ్రమణ్య ఆరాధన మరియు శివారాధన చేయడం చెప్పదగ్గ సూచన.

వృషభరాశి: కృత్తిక – 2, 3, 4 పాదములు, రోహిణి – 1, 2, 3, 4 పాదములు, మృగశిర – 1, 2 పాదాలు

వృషభరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు. కృషితో  ముందుకు వెళ్లడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన కాలం. 

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము సుబ్రహ్మణ్య ఆరాధన మరియు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగ్గ సూచన.

మిథునరాశి: మృగశిర – 3, 4 పాదములు, ఆర్ద్ర – 1, 2, 3, 4 పాదములు, పునర్వసు – 1, 2, 3 పాదములు

మిధునరాశి వారికి ఈవారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో  సామాన్యంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు లేకపోవడం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇతరుల యొక్క సహాయసహకారాలు ఎక్కువగా ఉంటాయి.  బంధు వర్గం  విషయంలో సామాన్యంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి  సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈవారం సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. వారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి.  రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన అవకాశాలు అందుతాయి. 

మొత్తంమీద ఈ వారం మిథునరాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందటం కొరకు నిత్యం లక్ష్మీ అష్టోత్తర నామ స్తోత్ర పారాయణము మరియు సుబ్రమణ్య ఆరాధన చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు.

కర్కాటకరాశి: పునర్వసు – 4వపాదము, పుష్యమి – 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష – 1, 2, 3, 4

కర్కాటకరాశి వారికి వారి ఆరోగ్య విషయాలలో  సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో  అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఆదాయంతో సమానంగా ఖర్చులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఉంటాయి. ప్రయాణాలు కొంతవరకు మేలు చేస్తాయి. ఈ రాశి విద్యార్థులకు సామాన్యమైన కాలం చెప్పవచ్చు. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది.  రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన కాలంగా ఉంటుంది. 

మొత్తంమ్మీద కర్కాటక రాశివారికి ఈవారం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. 

మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము దత్త చరిత్ర పారాయణము మరియు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా మరింత ఉత్తమమైన ఫలితాలు పొందుతారు.

సింహరాశి: మఖ – 1, 2, 3, 4 పాదములు, పుబ్బ – 1, 2, 3, 4 పాదములు, ఉత్తర – 1 పాదం

సింహరాశి వారికి ఈవారం ఆరోగ్య విషయాలలో సామాన్యంగా ఉంటుంది.  జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో  ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో  సామాన్యంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషమం సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. రాజకీయ, సినీ, కళ  తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యంగా ఉంటుంది. 

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము ఆదిత్య హృదయ పారాయణ మరియు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం ద్వారా మరింత ఉత్తమమైన ఫలితాలు పొందుతారు.

కన్యారాశి: ఉత్తర – 2, 3, 4 పాదములు, హస్త – 1, 2, 3, 4 పాదములు, చిత్త – 1, 2 పాదములు

కన్యరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం ఉత్తమం. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి కనబడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. శుభ వార్తలు వింటారు. ఈ రాశి వారికి ఈ వారం సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా కష్టంతో కూడిన ఫలితాలు ఉంటాయి. 

మొత్తం మ్మీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందగలరు నిత్యము లక్ష్మీ ఆరాధన మరియు శివారాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు.


తులారాశి: చిత్త – 3, 4 పాదములు, స్వాతి – 1, 2, 3, 4 పాదములు, విశాఖ – 1, 2, 3 పాదములు

తులారాశి వారికి ఈవారం ఆరోగ్య విషయాల్లో సాధారణంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో  సాధారణంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలత ఉంటుంది. నూతన పరిచయాలు  లాభిస్తాయి. ప్రయాణాలు కూడా కొంతవరకు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది.  సమాచార కేంద్రంలో పనిచేసే వారికి  కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం సామాన్యమైన కాలంగా ఉన్నా, కాస్త శ్రద్ధ వహించి చదవాల్సి ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా శుభ ఫలితాలు వస్తాయి. 

మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము అమ్మ వారి యొక్క ఆరాధన మరియు ఆదిత్య హృదయ పారాయణ చేయడం ఉత్తమం.

వృశ్చికరాశి: విశాఖ – 4వపాదము, అనూరాధ – 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ – 1, 2, 3, 4 పాదములు

వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో కొంచెం అలసట ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపార విషయాలలో ఇదివరకటికన్నా ఈవారం కొంత ఊరట లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కుటుంబపరంగా కొంచెం ఖర్చులు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు ఈ వారం కాస్త శ్రద్ధ వహించి చదవాల్సి వస్తుంది. ఈ వారం కాస్త పరీక్షా కాలంగా ఉంటుంది. చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.

మొత్తంమీద వృశ్చికరాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలు  పొందటం కొరకు నిత్యము సుబ్రమణ్య ఆరాధన మరియు శివారాధన చేయడం చెప్పదగ్గ సూచన.

ధనూరాశి: మూల – 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాడ – 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ – 1 వపాదము

ధనురాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో  సామాన్యంగానే ఉంటుంది. ఇతరులతో మాట్లాడే విధానంలో కాస్త జాగ్రత్త వహించాలి. నూతన వ్యక్తుల పరిచయాలు, ఆ పరిచయంతో కాస్త ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఉంది.  వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఆదాయమునకు తగ్గ ఖర్చు ఉంటుంది. కొన్ని పనులలో కాస్త ఉత్సాహంగా ఉంటారు. ఆ ఉత్సాహంతో ముందుకు వెళ్లడం ద్వారా కొన్ని పనులు సాధించడం జరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి సామాన్యంగా ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు. 

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ  ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 

మీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము  గణపతి ఆరాధన, శివారాధన మరియు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగ్గ సూచన.

మకరరాశి: ఉత్తరాషాడ – 2, 3, 4 పాదములు, శ్రవణం – 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ – 1, 2 పాదములు

మకర రాశి వారికి వారు ఆరోగ్య విషయాల్లో బాగుంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలోసామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో  అనుకూలత ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది.  సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కాకపోతే కాస్త శ్రద్ధ వహించి చదవాల్సి కూడా ఉంటుంది. 

మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి నిత్యము  సుబ్రహ్మణ్య ఆరాధన మరియు గణపతి అష్టోత్తరం చదవడం ఉత్తమం.

కుంభరాశి: ధనిష్ఠ – 3, 4 పాదములు, శతభిషం – 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర – 1, 2, 3 పాదములు
కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో సామాన్యంగా ఉంటుంది. బంధువర్గం నుండి స్నేహం వర్గం నుండి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో  ఖర్చులు నియంత్రించుకోవడం ఉత్తమం. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో  సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలంగా ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారు కూడా శ్రమతో కూడుకున్న మంచి ఫలితాలు పొందుతారు.

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము హనుమాన్ చాలీసా పారాయణము, లక్ష్మీ ఆరాధన మరియు దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం ఉత్తమం.

మీనరాశి: పూర్వాభాద్ర – 4 వపాదం, ఉత్తరాభాద్ర – 1, 2, 3, 4 పాదములు, రేవతి – 1, 2, 3, 4 పాదములు

మీనరాశి వారికి ఈవారం ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించడం అనేది ఉత్తమం. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో  చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి,  వివాదాస్పద చర్చలు చర్చించకపోవడం  ఉత్తమం.  వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో  ఊరట ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. పోటి రంగాలలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.  

మొత్తంమ్మీద మీనరాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలను మిశ్రమంగా ఉన్నాయి..   

మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందటం కొరకు నిత్యము  సుబ్రహ్మణ్య ఆరాధన దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మరియు  అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ఉత్తమం.

**వ్యక్తిగత జాతకాలకు మరియు ఇతర వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి
మా నంబర్లు: 8121009900 (whatsapp) / 8121003300
మా ఈమెయిల్: service@meepurohit.com
#horoscope #weeklyhoroscope #meepurohit #astrology #raasiphalalu #varaphalalu