రథ సప్తమి

ఒక పక్షములో వచ్చే ఏడవ తిథిని సప్తమి అంటారు. ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతకు ప్రత్యేకమైనది. సప్తమి తిథి సూర్యభగవానుడికి ప్రత్యేకమైనది. మాఘ మాసములో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి ఆయనకు మరింత ప్రత్యేకత కలిగినది. కనుక ఆరోజున మనం రథ సప్తమి పండుగ జరుపుకొంటాము.

మకరసంక్రమణం రోజున సూర్యుడు ఉత్తరానికి తిరుగుతాడని తెలుసు. ఆ ఉత్తరపు నడక ఈరోజు నుంచి సరియైన దిశలో సాగుతుంది. సూర్యుడి రథసారథి అయిన అరుణుడు రథాన్ని ఈరోజు నుండి ఈశాన్య దిక్కువైపు పోనిస్తాడు.

అలాగే సూర్యుడి రథానికి ఒకే ఒక్క చక్రం ఉంటుందని ప్రతీతి. ఆ చక్రమే కాలచక్రం. సూర్యుడి రథాన్ని లాగే ఏడు గుర్రాలు ఇంద్రధనుస్సులోని ఏడు రంగులు. అలాగే ఏడు గుర్రాలు వారములోని ఏడు రోజులకు ప్రతీకలని కూడా ఒక నమ్మకం. అందుకనే వారములోని మొదటి రోజైన ఆదివారం సూర్యభగవానుడికి కేటాయించబడింది. కనుకనే ఈ మాసములో వచ్చే అన్ని ఆదివారములలోను సూర్యుడికి విశేష ఆరాధన జరుగుతుంది.

సూర్యుడి రథచక్రాన్ని సంవత్సరం అని కూడా అంటారు. ఇందులో 12 రాశులు ఉంటే, సూర్యుడు ఒక్కో రాశిలో ఒక్కో మాసం చొప్పున సంవత్సర కాలం ప్రయాణం చేస్తాడు.

మాఘమాసములో స్నానానికి విశేష ఫలితం ఉంది. ఈ రథసప్తమి నాడు చేసే స్నానానికి మరింత ప్రత్యేకత ఉన్నది. ఈ రోజున 7 జిల్లేడు ఆకులను తెచ్చి ఒకటి నెత్తిమీద, రెండు భుజాల మీద, మరో రెండు మోకాళ్ళ మీద, ఆఖరి రెండు పాదాల మీద ఉంచి స్నానం చెయ్యాలి. ఈ జిల్లేడు పాత్రలనే అర్క పత్రాలు అంటారు. ఇవి సూర్యునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. నెత్తిమీద పెట్టిన జిల్లేడు ఆకులోరేగుపండును కూడా ఉంచుతారు.

రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

*నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!

*యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!

*ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!

*ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!

స్నానం అరుణోదయ సమయానికి పూర్తి చేసి, ఆవు పిడకలతో దాలిని ఏర్పాటు చేసి, దానిపై ఆవుపాలు, బెల్లము ఉపయోగించి బియ్యం పరమాన్నం తయారుచేసి ఆ ప్రసాదాన్ని చిక్కుడు ఆకులలో ఉంచి సూర్యునికి నైవేద్యం పెడతారు. అలాగే చిక్కుడు కాయలతో రథములా తయారుచేసి అక్కడ ఉంచుతారు. ఈ రోజున తరిగిన కూర తినకూడదని పెద్దలు చెప్తారు. అందువలన చిక్కుడు కాయలను చేతితో తుంపి ఆ కూరను వండుకుంటారు.

రథసప్తమి రోజున క్రొత్తగా వివాహం అయిన ఆడపిల్లలచేత గ్రామకుంకుమ, కైలాస గౌరి వంటి నోములు పట్టేవారు ఆ కథను చదివి అక్షతలు నెత్తిన చల్లుకుంటారు. ఆ విధముగా చేయటం వలన వారికి ఆ నోము చెయ్యటానికి అర్హత కలిగినట్లుగా భావిస్తారు.

Ratha Saptami

7th day in a fortnight is called Saptami. Ratha means chariot. Each day in a fortnight is attributed to one God. This 7th day (Saptami tithi) is allotted to Sun God. Hence this Saptami is a favorite day to Sun God. Especially Sukla Saptami in Magh masam is much special to him. So we celebrate Ratha Saptami on this day.

We all know that from Makar Sankramana, Sun changes his direction from south to north. His traverse will take a definite form from this day on wards. From this day on wards, Aruna, the charioteer of Sun, will take the chariot of Sun God to north-east direction.

It is believed that the chariot of Sun God has only one wheel which is called Kaal-chakra. The 7 horses which pull this chariot are the 7 colors in VIBGYOR. Some people say these horses represent seven days in a week and Sun God’s favorite day is the first day of the week “Sunday“. That’s why in this month, not only on Ratha Saptami day, but also on every Sunday people will perform special rituals to the Sun God.

The wheel of the Sun’s chariot is also known as a Year. It has 12 leaves which represents 12 zodiac signs. Sun will stay one month in each sign and take 12 months or 1 year to complete his travel.

The holy bath in this Magh Masam will give great results & on this Ratha Saptami it is much more special. While taking bath, one has to get 7 Madar plant leaves (medicinal) called arka patras in sanskrit. one leaf to be kept on head along with one red plum on top of the leaf, two leaves on both shoulders, two on both knees and remaining two on feet. These leaves are favorite to Sun God.

An age old belief that during this holy bath, reading following verses will remove all sins one has done during his past 7 births.

• Namastē rudra rūpāya rasānāṁ patayē namaḥ
aruṇāya namastēstu harivāsa namōstutē!!

Yadyajjanma kr̥taṁ pāpaṁ mayā janmasu saptasu!
Tanmē rōgan̄ca śōkan̄ca mākarī hantu saptamī!!

Ētajjanma kr̥taṁ pāpaṁ yajjanmānta rārjitam!
Manō vākkāyajaṁ yacca jñātājñātē ca yē punaḥ!!

Iti sapta vidhaṁ pāpaṁ snānānmē sapta saptikē!

On this day, before sun rise, one should complete this holy bath and prepare a “Daali’ (autoclave) with cow dung cakes. On the that place a bowl with cow milk, rice and jaggery to prepare Paramaannam, place this on a bean leaf and offer this to Sun God. Prepare a chariot with lablab beans and place it in front of Sun. On this day, one do not eat a curry prepared with cut vegetables. So they prepare a curry with this Beans only.
This Ratha Saptami is auspicious for newly married women too. Traditionally, it is auspicious to commence (by placing sacred yellow rice) any special Vrathas or Nomus like Grama-kumkuma, Kailasa-gowri vratam by reading the respective stories. It is believed that, with this they get eligible to perform those special Vratha or Nomu.

auspiciousness of maghamasam, radha saptami, , auspicious days of Maghamasa, bhishmekadasi, birth anniversary of ramakrishna paramahamsa, birth anniversary of swami dayananda, purohit and puja related services, purohit services, purohit services online, online purohit booking, book puja online, meepurohit, meepurohit services, purohit and puja services hyderabad, purohit services kukatpally, purohit services nallakunta, online puja stores, puja material online